![]() |
![]() |

జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో విత్ జగపతి ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం ఒక డెవిల్, ఒక యానిమల్ కాంబో ఇంటర్వ్యూ మాత్రం ఒక రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక సందీప్ రెడ్డి వంగ, రామ్ గోపాల్ వర్మ టీచర్ అనే కాన్సెప్ట్ గురించి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. "కొత్త డైరెక్టర్ మీ ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకోకూడని క్వాలిటీ ఏంటి..." అని జగపతి అడిగారు. దానికి " ఒక డైరెక్టర్ గా నా తప్పులు ఏంటో నాకు తెలిస్తే అది చేయకూడదు అని చెప్పొచ్చు కానీ అది నాకే తెలీదు. కాబట్టి నేను చెప్పలేను.నా ఉద్దేశంలో ఏ కొత్త డైరెక్టర్ ఐనా కానీ సందీప్ నుంచి నేర్చుకోవాలి. హీవైగా విఎఫ్ఎస్ , ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా క్లోజప్స్ లో చాలా జెనెరేట్ చేయగలడు సందీప్. అది ఇండియాలో ఏ డైరెక్టర్ కూడా చేయలేడు. అందరూ 10, 15 కోట్లు పెట్టి హీరో ఎలివేషన్స్ ఇంట్రడక్షన్ సీన్స్ చేస్తారు. కానీ సందీప్ మాత్రం యానిమల్ మూవీలో రన్బీర్ కపూర్ కి క్లోజప్ పెడితే బయట నుంచి మెషిన్ గన్ తో లోపలికి వస్తాడు. అది ఎలివేషన్ సీన్. అది థియేటర్ లో చూసాక నా లైఫ్ లో నేను నిలబడి చప్పట్లు కొట్టిన సీన్. నిజానికి ఐడియా లేనప్పుడే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఐడియా ఉంటే సందీప్ అవుతాడు." అని చెప్పారు ఆర్జీవీ.
రాము మీద నీ ఒపీనియన్ ఏంటి అని జగపతి సందీప్ ని అడిగారు. "నేను రాము గారి గురించి ఇప్పటికిప్పుడు మాటల్లో చెప్పలేను కానీ 50 - 60 టైమ్స్ చూసి ఉంటా. ఆయన ఫిలిమ్స్ నుంచి ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నా. సత్య మూవీ నుంచి నేను ఎడిటింగ్ నేర్చుకున్నా. రాము గారి దగ్గర నేను పనిచేయకపోయినా ఆయన నా గురు." అని చెప్పారు సందీప్ రెడ్డి వంగ. ఇక ఆర్జీవీ ఐతే "సందీప్ లాంటి స్టూడెంట్ ఉంటే నేను టీచింగ్ మానేసేవాడిని. ఎవరు ఎవరికీ నేర్పలేరు. సత్య, శివ మూవీస్ కి సందీప్ మూవీస్ కి అసలు కనెక్షన్ లేదు. టీచర్ అనే దాన్ని గౌరవించను. డాక్టర్ సక్సెస్ ఫుల్ డాక్టర్, బిజినెస్ మాన్ సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అవుతాడు కానీ టీచర్ సక్సెస్ ఫుల్ టీచర్ అన్న పేరెక్కడన్నా వినిపిస్తుందా... వినిపించదు.. ఎవరినన్నా టీచర్ అంటే అది ఇన్సల్టింగ్ వర్డ్ అనిపిస్తుంది. మరి నేను సందీప్ లాంటి హిట్ మూవీస్ ని నేనేందుకు తీయలేకపోతున్నా అప్పుడు నేను టీచర్ ని ఎలా అవుతాను. కాబట్టి సత్య మూవీ నా టీచర్ అని చెప్పాలి కానీ రామ్ గోపాల్ వర్మ నా టీచర్ అని కాదు చెప్పాల్సింది. గ్రేట్ ఫిలిమ్స్ ఉంటాయి గ్రేట్ ఫిలిం మేకర్స్ ఉండరు. ఫిలిం నుంచి చాలా నేర్చుకోవచ్చు ఎందుకంటే అదొక ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ కి మనిషికి సంబంధం ఉండదు. అందుకే టీచర్ అన్న మాట సుద్ద వేస్ట్ " అని చెప్పుకొచ్చారు ఆర్జీవీ.
![]() |
![]() |